Share News

ఎన్‌ఎ్‌సఈ : 11 కోట్ల ఇన్వెస్టర్లు

ABN , Publish Date - Jan 23 , 2025 | 06:21 AM

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో (ఎన్‌ఎ్‌సఈ) నమోదైన ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మైలురాయిని దాటింది. ఎన్‌ఎస్‌ఈ బుధవారం ఈ విషయం ప్రకటించింది. గడిచిన 5 నెలల్లోనే...

ఎన్‌ఎ్‌సఈ : 11 కోట్ల ఇన్వెస్టర్లు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో (ఎన్‌ఎ్‌సఈ) నమోదైన ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మైలురాయిని దాటింది. ఎన్‌ఎస్‌ఈ బుధవారం ఈ విషయం ప్రకటించింది. గడిచిన 5 నెలల్లోనే ఇన్వెస్టర్ల సంఖ్య కోటి మేర పెరిగిందని ఎక్స్ఛేంజ్‌ తెలిపింది. గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగారు. 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎస్‌ఎ్‌సఈకి కోటి మంది ఇన్వెస్టర్ల మైలురాయిని చేరుకునేందుకు 14 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత ఏడేళ్లలోనే ఇన్వెస్టర్లు 2 కోట్లకు పెరిగారు. ఆ తర్వాత 3.5 ఏళ్లలోనే 3 కోట్లకు, ఆపై ఏడాది కాలంలోనే 4 కోట్లకు చేరారని ఎక్స్ఛేంజ్‌ వెల్లడించింది. అప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంఖ్య 6-7 నెలలకు కోటి చొప్పున పెరుగుతూ వచ్చిందని తెలిపింది.


Also Read:

రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్

సైఫ్ కేసు.. వాళ్లే చంపాలనుకున్నారా

కొంప ముంచిన పిల్లి.. ఉద్యోగం లేదు, బోనస్ లేదు..

For More Business News and Telugu News..

Updated Date - Jan 23 , 2025 | 06:27 AM