Internal Conflict at Tata Trusts: టాటా ట్రస్టులో ఇంటి పోరు!
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:24 AM
టాటాల సామ్రాజ్యంలోనూ ఇంటి పోరు ప్రారంభమైనట్టు సమాచారం. రతన్ టాటా వారసుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా అధికారాలపై...
నోయెల్ టాటా అధికారాలపై గుస్సా
10న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: టాటాల సామ్రాజ్యంలోనూ ఇంటి పోరు ప్రారంభమైనట్టు సమాచారం. రతన్ టాటా వారసుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా అధికారాలపై ట్రస్టు సభ్యులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ ఈక్విటీలో టాటా ట్రస్ట్స్‌కు 60 శాతానికిపైగా వాటా ఉంది. టాటా సన్స్ బోర్డులోకి నోయెల్ టాటా కొందరి పేర్లను సూచించగా నలుగురు ట్రస్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ నెల 10న జరిగే టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం గరంగరంగా జరుగుతుందని భావిస్తున్నారు.
టాటా సన్స్ లిస్టింగ్‌పై చర్చ
శుక్రవారం జరిగే టాటా ట్రస్ట్స్ బోరు ్డసమావేశంలో టాటా సన్స్ లిస్టింగ్‌పైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం గత నెలాఖరుకే ఈ కంపెనీ ఐపీఓ పూర్తి కావాల్సి ఉంది. అయితే సెబీ అనుమతి ఉన్నా టాటా గ్రూప్ ఆ పని పూర్తి చేయలేక పోయింది. మరోవైపు టాటా సన్స్ ఈక్విటీలో 18.37 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ తన అప్పుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా ఐపీఓ జారీ చేస్తే పారదర్శకంగా తన వాటాను మార్కెట్ ధరకు విక్రయించి బయట పడొచ్చని ఆశించింది.
అయితే ఐపీఓ వాయిదాల మీద వాయిదాలు పడడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. తన భార్య ఎస్‌పీ గ్రూప్ చీఫ్ సోదరి కావడంతో నోయెల్ టాటా దీనిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. దీనికి కూడా టాటా ట్రస్ట్‌లోని కొందరు ట్రస్టీలు నోయెల్ టాటాను తప్పుపడుతున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి