Seemant Shukla: ఈక్విటీ పెట్టుబడులకు ఢోకా లేదు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:44 AM
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులకు ఏ మాత్రం ఢోకా లేదని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ సీమంత్ శుక్లా అన్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న...
క్వాంటమ్ ఎంఎఫ్ సీఈఓ సీమంత్ శుక్లా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులకు ఏ మాత్రం ఢోకా లేదని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ సీమంత్ శుక్లా అన్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ఆటుపోట్లన్నీ తాత్కాలికమైనవని, దీర్ఘకాలంలో ఇవి మరింత వృద్ధి పథంలో సాగే అవకాశం ఉందన్నారు. మంగళవారం నాడిక్కడ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ రీజినల్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే మదుపరులు దీర్ఘకాలంలో అత్త్యుత్తమ రిటర్నులు అందుకునే వీలుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లలో సాగుతున్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు నిలకడగా సాగుతూ వస్తున్నాయని, ఇది మదుపరులకు కలిసిరానుందని ఆయన పేర్కొన్నారు. క్రమానుగత పెట్టుబడుల (సిప్) రూపంలో పెట్టే పెట్టుబడులు నిలకడైన రిటర్నులు అందిస్తుండటంతో చాలా మంది మదుపరులు వాటిపై మక్కువ చూపిస్తూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్, ఐటీ రంగాలు బుల్లి్‌షగా ఉన్నాయన్నారు. కాగా ప్రస్తుతం క్వాంటమ్ పోర్టుఫోలియోలో 14 పథకాలు ఉండగా నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.3,700 కోట్లుగా ఉందన్నారు. క్వాంటమ్ దేశవ్యాప్తంగా 9 కార్యాలయాలను నిర్వహిస్తుండగా వచ్చే ఏడాది నాటికి మరో 4 కొత్త కార్యాలయాలను ప్రారంభించాలని చూస్తున్నట్లు శుక్లా వెల్లడించారు.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..