Share News

Samsung India: భారత వ్యాపారాల లిస్టింగ్‌ యోచన లేదు

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:54 AM

దక్షిణ కొరియా ఎలక్ర్టానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఎలక్ర్టానిక్స్‌ తమ భారతీయ వ్యాపార విభాగాన్ని లిస్టింగ్‌ చేసే యోచన ఏదీ ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. దానికి...

Samsung India: భారత వ్యాపారాల లిస్టింగ్‌ యోచన లేదు

సామ్‌సంగ్‌ సీఈఓ జేబీ పార్క్‌

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ర్టానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఎలక్ర్టానిక్స్‌ తమ భారతీయ వ్యాపార విభాగాన్ని లిస్టింగ్‌ చేసే యోచన ఏదీ ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. దానికి బదులుగా తమ ఉత్పత్తులన్నింటిలోనూ కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రవేశపెడతామని, దేశీయ మార్కెట్లో విక్రయాలను పెంచుకునేందుకు కన్స్యూమర్‌ ఫైనాన్స్‌ విభాగాన్ని విస్తరిస్తామని తెలిపింది. సామ్‌సంగ్‌ ఆగ్నేయాసియా విభాగం ప్రెసిడెంట్‌, సీఈఓ జేబీ పార్క్‌ వెల్లడించారు. కాగా దేశంలో తయారీని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ డిస్‌ప్లేలు దేశంలోనే తయారు చేసేందుకు వీలుగా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలకు (పీఎల్‌ఐ) దరఖాస్తు చేసినట్టు పార్క్‌ తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీలు హ్యుండయ్‌ మోటార్‌, ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ ఇటీవల పబ్లిక్‌ ఇష్యూల (ఐపీఓ)కు వచ్చినప్పటికీ తమకు మాత్రం ప్రస్తుతానికి అలాం టి ఆలోచన ఏదీ లేదని పార్క్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 04:54 AM