ఎన్‌ఎండీసీ లాభంలో 30 శాతం వృద్ధి
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:25 AM
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.1,944 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.1,944 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.1,492 కోట్లు)తో పోల్చితే లాభం 30 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 21 శాతం వృద్ధితో రూ.5,410 కోట్ల నుంచి రూ.6,531 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో ముడి ఇనుప ఖనిజ ఉత్పత్తి 9 శాతం పెరిగి 1.32 కోట్ల టన్నులకు చేరుకుందని ఎన్‌ఎండీసీ పేర్కొంది. కాగా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ రూ.6,942.92 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.1,896.66 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వృద్ధిపథంలోనే సాగుతూ వస్తోందని ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. దేశీయంగా ముడి ఇనుము, స్టీల్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతూ వస్తోందన్నారు.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News