Share News

13 శాతం పెరిగిన ఎన్‌ఎండీసీ లాభం

ABN , Publish Date - May 28 , 2025 | 05:44 AM

ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చక్కటి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.23,668 కోట్ల టర్నోవర్‌పై రూ.6,693 కోట్ల నికర లాభం...

13 శాతం పెరిగిన ఎన్‌ఎండీసీ లాభం

ఒక్కో షేరుపై రూపాయి డివిడెండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చక్కటి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.23,668 కోట్ల టర్నోవర్‌పై రూ.6,693 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టర్నోవర్‌ 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ కంపెనీ రూ.7,444 కోట్ల టర్నోవర్‌పై రూ.1,496 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవర్‌ ఎనిమిది శాతం పెరిగినా, నికర లాభం నామమాత్రంగా రెండు శాతం మాత్రమే పెరిగింది. అయినా 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేరుపై రూపాయి చొప్పున తుది డివిడెండ్‌గా చెల్లించాలని ఎన్‌ఎండీసీ బోర్డు సిఫారసు చేసింది. ఇంతకు ముందు చెల్లించిన రూ.2.3 మధ్యంతర డివిడెండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ ఒక్కో షేరుపై రూ.3.3 చొప్పున డివిడెండ్‌ చెల్లించినట్టవుతుంది. రూపాయి ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఇది 330 శాతానికి సమానం.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:44 AM