NLCL India: 2030 నాటికి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:55 AM
ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎల్‌సీ ఇండియా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 2030 నాటికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. కంపెనీ ఎండీ, సీఈఓ మోటుపల్లి ప్రసన్న...
పునరుత్పాదక, హరిత ఇంధనంపై దృష్టి
ఎన్‌ఎల్‌సీ ఇండియా సీఎండీ
హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎల్‌సీ ఇండియా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 2030 నాటికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. కంపెనీ ఎండీ, సీఈఓ మోటుపల్లి ప్రసన్న కుమార్ పీటీఐ వీడియో్‌సకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. దీంతో తమ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ప్రస్తుత 6,700 మెగావాట్ల నుంచి 2030 నాటికి 20,000 మెగావాట్లకు చేరుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఖర్చు చేసే రూ.1.25 లక్షల కోట్లలో రూ.65,000 కోట్లు పునరుత్సాదక, హరిత ఇంధన ప్రాజెక్టులపై ఖర్చు చేస్తామన్నారు. మిగతా రూ.60,000 కోట్లలో రూ.45,000 కోట్లు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మిగతా రూ.15,000 కోట్లు గనుల అభివృద్ధి కోసం ఖర్చు చేయబోతున్నట్టు ఆయన చెప్పారు. పునరుత్పాదక, హరిత ఇంధన ప్రాజెక్టులపై చేసే రూ.65,000 కోట్ల ఖర్చులో రూ.15,000 కోట్లు బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయబోతున్నట్టు వెల్లడించారు.
ఇతర ముఖ్యాంశాలు
తెలంగాణకు 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా ఒప్పందంపై సంతకాలు.
అంతర్గత వనరులు, దేశ, విదేశీ రుణాలు, ఐపీఓ ద్వారా విస్తరణ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే అనుబధ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ (ఎన్‌ఐఆర్‌ఎల్) ఐపీఓ.
ఎన్‌ఐఆర్‌ఎల్ ప్రాజెక్టుల్లో రూ.3,720 కోట్ల పెట్టుబడులకు సూత్రప్రాయ ఆమోదం
మాలిలో లిథియం ఖనిజ ప్రాజెక్టు కోసం రష్యా కంపెనీలో ఈక్విటీ వాటా
కాంగోలో కాపర్, కోబాల్ట్ ఖనిజ గనుల కోసం చర్చలు
ఇవి కూడా చదవండి
నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి