Nissans New SUV Tecton: వచ్చే ఏడాది మార్కెట్లోకి నిస్సాన్ టెక్టాన్
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:56 AM
వచ్చే ఏడాది విడుదల చేయనున్న కొత్త కారు టెక్టాన్‌తో జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్న మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశిస్తోంది...
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది విడుదల చేయనున్న కొత్త కారు టెక్టాన్‌తో జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్న మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశిస్తోంది. తద్వారా భారత్‌లో తమ బ్రాండ్‌ను పునరుజ్జీవింపచేయతలచినట్టు నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స చెప్పారు. హ్యుండయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్‌లకు గట్టి పోటీ ఇచ్చే ఈ కారును వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. టెక్టాన్‌ను దేశీయంగానే తయారుచేయనున్నట్టు వెల్లడించారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి