Nissan India: 2027 నాటికి 3 కొత్త కార్లు
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:27 AM
మల్టీపర్సస్ వెహికల్ (ఎంపీవీ) పేరును ‘‘గ్రావైట్’’గా గురువారం ప్రకటించింది. అదే ఏడాది మధ్యలో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ టెక్టన్‌ను...
వచ్చే ఏడాది
7 సీట్ల ఎంపీవీ గ్రావైట్ : నిస్సాన్
న్యూఢిల్లీ: Nissan India మల్టీపర్సస్ వెహికల్ (ఎంపీవీ) పేరును ‘‘గ్రావైట్’’గా గురువారం ప్రకటించింది. అదే ఏడాది మధ్యలో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ టెక్టన్‌ను, 2027 ప్రారంభంలో ఏడు సీట్ల ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్టు నిస్సా అమియో (ఆఫ్రికా, పశ్చిమాసియా, ఇండియా, యూరప్, ఓషియానా) చైర్ పర్సన్ మాసిమిలియానో మెస్సినా తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి దేశంలో తమ సేల్స్ నెట్‌వర్క్ ను 155 నుంచి 250కి పెంచనున్నట్టు కూడా చెప్పారు. భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగానే ఈ కార్లను తయారు చేస్తున్నామని, వాటిని విదేశీ మార్కెట్లకు ఎగుమతి కూడా చేస్తామని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మాగ్నైట్ కారును మాత్రమే నిస్సాన్ విక్రయిస్తోంది.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News