Share News

టెక్‌ వ్యూ తదుపరి నిరోధం 26000

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:27 AM

నిఫ్టీ గత వారం ప్రారంభంలో కరెక్షన్‌లో పడినా కీలకమైన 25,000 స్థాయిలో బలమైన పునరుజ్జీవంతో వారం గరిష్ఠ స్థాయి 25,640 సమీపంలో ముగిసింది. ఆరు వారాల కన్సాలిడేషన్‌ అనంతరం...

టెక్‌ వ్యూ తదుపరి నిరోధం 26000

నిఫ్టీ గత వారం ప్రారంభంలో కరెక్షన్‌లో పడినా కీలకమైన 25,000 స్థాయిలో బలమైన పునరుజ్జీవంతో వారం గరిష్ఠ స్థాయి 25,640 సమీపంలో ముగిసింది. ఆరు వారాల కన్సాలిడేషన్‌ అనంతరం మార్కెట్‌ బలమైన ర్యాలీతో బ్రేకౌట్‌ సాధించింది. అలాగే మిడ్‌క్యాప్‌-100 సూచీ కూడా 1,400 పాయింట్ల మేరకు లాభపడి ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయి 60,000 చేరువకు వస్తోంది. స్మాల్‌క్యాప్‌-100 సూచీ 780 పాయింట్ల లాభంతో 19,000 సమీపంలో నిలిచింది. గత వారం నిట్టనిలువుగా ర్యాలీని సాధించినందు వల్ల ఈ వారంలో తదుపరి దిశ తీసుకునే ముందు కన్సాలిడేట్‌ కావచ్చు. టెక్నికల్‌గా ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉన్నా అప్రమత్త ట్రెండ్‌కు ఆస్కారం ఉంది.

బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం తదుపరి నిరోధం 25,850 కన్నా పైన నిలదొక్కుకోవాల్సి ఉంది. ప్రధాన నిరోధ స్థాయిలు 26,000, 26,100. ఇక్కడ కన్సాలిడేట్‌ కావచ్చు. మరింత సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి.

బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌కు గురైనా సానుకూలత కోసం మైనర్‌ మద్దతు స్థాయి 25,500 వద్ద నిలదొక్కుకోవాలి. అంతకన్నా దిగజారితే మైనర్‌ బలహీనత ఏర్పడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 25,000. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ 1,200 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించి ఆల్‌ టైమ్‌ హై 57,450 వద్ద ముగిసింది. మానసిక అవధి 58,000. ఇక్కడ కన్సాలిడేట్‌ కావచ్చు. ఆ పైన మాత్రమే అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది. బలహీనపడినా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 57,000 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది.


పాటర్న్‌: నిఫ్టీ స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిలో ప్రవేశిస్తున్నందు వల్ల ట్రేడర్లు అప్రమత్తం కావాలి. మరింత అప్‌ట్రెండ్‌ కోసం 26,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి. వీక్లీ చార్టుల్లో బ్రేకౌట్‌ కనిపిస్తున్నందు వల్ల పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు కూడా ఆస్కారం ఉంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,760, 25,850

మద్దతు : 25,560, 25,500

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 03:27 AM