Share News

టెక్‌ వ్యూ 25,000 ఎగువన నిలదొక్కుకుంటేనే

ABN , Publish Date - May 19 , 2025 | 04:34 AM

నిఫ్టీ గత వారం ఆరంభంలో బుల్లిష్‌ ట్రెండ్‌తో ప్రారంభమై ఆ తర్వాత కరెక్షన్‌కు లోనైంది. అనంతరం కోలుకుని చివరకు 25,000 స్థాయిలకు స్వల్ప ఎగువన క్లోజైంది. వారం మొత్తానికి నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది...

టెక్‌ వ్యూ 25,000 ఎగువన నిలదొక్కుకుంటేనే

టెక్‌ వ్యూ : 25,000 ఎగువన నిలదొక్కుకుంటేనే..

నిఫ్టీ గత వారం ఆరంభంలో బుల్లిష్‌ ట్రెండ్‌తో ప్రారంభమై ఆ తర్వాత కరెక్షన్‌కు లోనైంది. అనంతరం కోలుకుని చివరకు 25,000 స్థాయిలకు స్వల్ప ఎగువన క్లోజైంది. వారం మొత్తానికి నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ గత ఆరు వారాలుగా 22,000 పాయింట్ల నుంచి ర్యాలీని కనబరుస్తూ వచ్చింది. రికార్డు స్థాయిలో 12 శాతం మేర ర్యాలీని సాధించింది. అయినప్పటికీ నిఫ్టీ ఇంకా ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలైన 26,200 పాయింట్లకు దిగువనే ఉంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ కూడా గత వారం మంచి లాభాలను నమోదు చేశాయి. కాగా ఈ వారం మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమైనా అప్రమత్త ధోరణిలో కొనసాగే వీలుంది. కీలకమైన 25,000 పాయింట్ల వద్ద మరోసారి పరీక్షను ఎదుర్కొనే వీలుంది. కొద్ది రోజుల పాటు ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తెలుస్తుంది.

బుల్లిష్‌ స్థాయిలు: ప్రస్తుత గరిష్ఠ స్థాయిలైన 25,000 వద్ద కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. సానుకూల ట్రెండ్‌ను సూచిస్తే 25,200 వద్ద మైనర్‌ నిరోధ స్థాయిలుంటాయి. ఇది గత ఏడాది అక్టోబరు 15న ఏర్పడిన స్థాయి. పాజిటివ్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తే తదుపరి నిరోధ స్థాయి 25,500.


బేరిష్‌ స్థాయిలు: ఏదేనీ బలహీనతను సూచిస్తే తదుపరి 25,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ప్రస్తుత అప్‌ట్రెండ్‌ను కొనసాగించాలంటే మాత్రం ఈ స్థాయిల వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాలి. తదుపరి మద్దతు స్థాయిలు 24,800, 24,500. అయితే ఈ మద్దతు స్థాయి కొంత దూరంగా ఉన్నందు వల్ల తక్షణ ముప్పు ఉండదు.

బ్యాంక్‌ నిఫ్టీ: వీక్లీ ప్రాతిపదికన ఈ సూచీ 3.2 శాతం లాభపడి 55,350 వద్ద క్లోజైంది. ఈ వారం అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే తదుపరి నిరోధ స్థాయిలు 56,000 వద్ద ఉంటాయి. అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత మద్దతు స్థాయిలైన 55,500 వద్ద విఫలమైతే బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం 20 డీఏంఏను అధిగమించి సానుకూల సంకేతాలు వెలువరించింది. ఈ వారం 25,000 వద్ద అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత సానుకూల ధోరణి ఏర్పడుతుంది. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ పొజిషన్‌లోకి మార్కెట్‌ ప్రవేశిస్తుండటంతో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద అప్రమత్తంగా ఉండాలి.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,140, 25,200

మద్దతు : 25,000, 24,920

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:34 AM