Stock Market Decline: 26000 దిగువకు నిఫ్టీ
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:04 AM
ఆఖరి అరగంటలో మదుపరులు భారీ స్థాయిలో లాభాల స్వీకరణకు పాల్పడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల బాట పట్టింది. సూచీలు ఇంట్రాడే లాభాలను...
లాభాల స్వీకరణతో కుంగిన మార్కెట్
2 రోజుల్లో రూ.7 లక్షల కోట్లు ఫట్
ముంబై: ఆఖరి అరగంటలో మదుపరులు భారీ స్థాయిలో లాభాల స్వీకరణకు పాల్పడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల బాట పట్టింది. సూచీలు ఇంట్రాడే లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 331.21 పాయింట్లు క్షీణించి 84,900.71 వద్దకు జారుకుంది. నిఫ్టీ 108.65 పాయింట్లు పతనమై 25,959.50 వద్ద స్థిరపడింది. సూచీలు నష్టపోవడం వరుసగా ఇది రెండో రోజు. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రెండు సెషన్లలో రూ.7 లక్షల కోట్లు తగ్గి రూ.469.68 లక్షల కోట్లకు (5.27 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
తేజస్ క్రాష్.. హెచ్‌ఏఎల్ షేరు డౌన్: గత వారాంతంలో జరిగిన దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన సంఘటన ఆ విమానాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) షేరు ధరపై ప్రభావం చూపింది. బీఎ్‌సఈలో ఈ షేరు ఒక దశలో 8.48ు క్షీణించింది. మళ్లీ కాస్త కోలుకున్నప్పటికీ, చివరికి 3.31ు నష్టంతో రూ.4,443 వద్ద ముగిసింది.
రూపాయికి స్వల్ప ఊరట : భారత కరెన్సీ ఆల్‌టైం రికార్డు కనిష్ఠం నుంచి కాస్త కోలుకుంది. డాలర్‌తో రూపా యి మారకం విలువ సోమవారం 50 పైసలు పెరిగి రూ.89.16 వద్ద ముగిసింది. దిగుమతిదారులు, బ్యాంక్‌లు భారీగా డాలర్ల అమ్మకాలకు పాల్పడటంతో పాటు క్రూడ్ ధరలు గణనీయంగా తగ్గడం ఇందుకు దోహదపడింది.
భారత్‌లో ఐపీఓకు సెంబ్‌కార్ప్: సింగపూర్‌కు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తన భారత అనుబంధ విభాగమైన సెంబ్‌కార్ప్ గ్రీన్ ఇన్‌ఫ్రా ఐపీఓకు మరోసారి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం సిటీ, హెచ్‌ఎ్‌సబీసీ బ్యాంక్ సహా మూడు ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్‌లను నియమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2019 జనవరిలో సెబీ నుంచి ఐపీఓ పత్రాలను ఉపసంహరించుకున్న సెంబ్‌కార్ప్.. ఐపీఓకు వచ్చేందుకు చేస్తున్న రెండో ప్రయత్నమిది.
3 ఐపీఓలకు సెబీ ఆమోదం: కృత్రిమ మేధ(ఏఐ) సంస్థ ఫ్రాక్టల్ అనలిటిక్స్, సాస్ సేవల సంస్థ అమాగీ మీడియా ల్యాబ్స్‌తో పాటు గుండెలో అమర్చే స్టెంట్ల తయారీదారు సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి