Tech View: టెక్ వ్యూ తదుపరి నిరోధం 25800
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:38 AM
గత వారం నిఫ్టీ 25,300 స్థాయి వరకు దిగజారినా శుక్రవారం ఇంట్రాడే రికవరీ సాధించి 160 పాయింట్ల మేరకు కోలుకుని 25,490 వద్ద ముగిసింది. ముందు వారంతో పోల్చితే 230 పాయింట్లు నష్టపోయింది....
గత వారం నిఫ్టీ 25,300 స్థాయి వరకు దిగజారినా శుక్రవారం ఇంట్రాడే రికవరీ సాధించి 160 పాయింట్ల మేరకు కోలుకుని 25,490 వద్ద ముగిసింది. ముందు వారంతో పోల్చితే 230 పాయింట్లు నష్టపోయింది. నాలుగు వారాల పాటు సాగిన ర్యాలీలో 1,500 పాయింట్ల మేరకు లాభపడిన నిఫ్టీ ప్రస్తుతం టెక్నికల్ కరెక్షన్‌లో ఉంది. జీవితకాల గరిష్ఠ స్థాయి 26,000 వద్ద బలమైన రియాక్షన్లు ఏర్పడుతూ ఉండడం ఇక్కడ గట్టి నిరోధం ఎదురవుతోందనేందుకు సంకేతం. ఈ కారణంగా స్వల్పకాలిక బలహీనత మరింత కొనసాగే ఆస్కారం ఉంది. గత శుక్రవారం నాటి అమెరికన్ మార్కెట్ ధోరణి ఆధారంగా నిఫ్టీ ప్రస్తుతం టెక్నికల్ రికవరీ సాధించవచ్చు. గత రెండు వారాల కాలంలో గరిష్ఠ స్థాయిల నుంచి 700 పాయింట్ల మేరకు నష్టపోయినందు వల్ల కూడా రికవరీ అవకాశాలున్నాయి.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ కోసం నిఫ్టీ మైనర్ నిరోధం 25,650 వద్ద నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 25,800. ఇక్కడ నిలదొక్కుకున్నప్పుడే అప్‌ట్రెండ్‌లో మరింతగా పురోగమిస్తుంది. ఆ పైన మరో ప్రధాన నిరోధం 26,100.
బేరిష్ స్థాయిలు: ప్రస్తుత మద్దతు స్థాయి 25,500 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 25,300 వద్ద రికవరీ అవకాశాలున్నాయి. ఇక్కడ కూడా విఫలమైతే మరింతగా బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 25,000.
బ్యాంక్ నిఫ్టీ: ప్రారంభ డౌన్‌ట్రెండ్ అనంతరం 320 పాయింట్ల మేరకు రికవరీ సాధించి జీవిత కాల గరిష్ఠ స్థాయిల వద్ద నిలకడగా క్లోజ్ కావడం ట్రెండ్‌లో సానుకూలతను సూచిస్తోంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ప్రస్తుత గరిష్ఠ స్థాయి 58,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 58,600. రియాక్షన్‌కు గురైనా భద్రత కోసం మద్దతు స్థాయి 57,400 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది.
పాటర్న్: వీక్లీ చార్టుల్లో గత వారం బ్రేక్‌డౌన్ పాటర్న్ ఏర్పడింది. స్వల్పకాలిక బలహీనత మరింత కొనసాగవచ్చుననేందుకు ఇది సంకేతం. నిఫ్టీ ప్రస్తుతం 50 డిఎంఏ వద్ద ఉంది. ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. 25,300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిఫ్టీకి మద్దతు ఉంది.
టైమ్:ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు. సోమవారం
స్థాయిలు
నిరోధం: 25,590, 25,650
మద్దతు: 25,450, 25,360
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి