Nifty 25000: మళ్లీ 25000 పైకి నిఫ్టీ
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:46 AM
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ సూచీలూ గురువారం లాభాల్లో పయనించాయి. సెన్సె క్స్ 123.58 పాయింట్లు పెరిగి...
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ సూచీలూ గురువారం లాభాల్లో పయనించాయి. సెన్సె క్స్ 123.58 పాయింట్లు పెరిగి 81,548.73 వద్ద స్థిరపడింది. సూచీ లాభపడటం వరుసగా ఇది నాలుగో రోజు. నిఫ్టీ 32.40 పాయింట్ల వృద్ధితో దాదాపు మూడు వారాల గరిష్ఠ స్థాయి 25,005.50 వద్దకు చేరింది. సూచీ లాభపడటం వరుసగా ఇది ఏడో రోజు. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 16 రాణించాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, ఎయిర్‌టెల్ షేర్లు ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం