Grand Vitara Phantom Black: నెక్సాకు పదేళ్లు
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:16 AM
మారుతి నెక్సా షోరూమ్‌ల నెట్‌వర్క్ ప్రారంభమై పదేళ్లు పూర్తయింది. పదో వార్షికోత్సవ సందర్భంగా కంపెనీ బహుళ జనాదరణ పొందిన ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ విటారాకు స్పెషల్ ఎడిషన్ ‘ఫాంటమ్ బ్లాక్’ను...
మార్కెట్లోకి గ్రాండ్ విటారా ‘ఫాంటమ్ బ్లాక్’
ప్రారంభ ధర రూ.11.42 లక్షలు
న్యూఢిల్లీ: మారుతి నెక్సా షోరూమ్‌ల నెట్‌వర్క్ ప్రారంభమై పదేళ్లు పూర్తయింది. పదో వార్షికోత్సవ సందర్భంగా కంపెనీ బహుళ జనాదరణ పొందిన ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ విటారాకు స్పెషల్ ఎడిషన్ ‘ఫాంటమ్ బ్లాక్’ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారం భ ధర రూ.11.42 లక్షలు. ఈ కారు ప్రత్యేకమైన మ్యాట్ బ్లాక్ కలర్ ర్యాప్‌లో, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆల్ఫా+ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. పనోరమిక్ సన్‌రూ్‌ఫ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అధునాతన స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కారియన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు, ఎలకా్ట్రనిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబీఎ్‌స+ఈబీడీ, హిల్ హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటివి దీని ప్రత్యేక ఆకర్షణలు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News