Newburg Diagnostics Partners: విజయ మెడికల్ కేర్‌తో న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ జట్టు
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:20 AM
విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ మెడికల్ సెంటర్‌తో డయాగ్నోస్టిక్ చెయిన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ వ్యూహాత్మక...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ మెడికల్ సెంటర్‌తో డయాగ్నోస్టిక్ చెయిన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద రాబోయే 60 రోజుల వ్యవధిలో ఉభయ సంస్థల సేవలను విజయ మెడికల్ సెంటర్ బ్రాండ్ కింద సమీకృతం చేయనున్నట్టు ప్రకటించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 18 జిల్లాల్లో ఉభయ సంస్థలు సేవలందిస్తుండగా రాబోయే రెండేళ్లలో మొత్తం 59 జిల్లాలకు సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. న్యూబర్గ్‌కు చెందిన అనుభవం, నాలుగు దశాబ్దాల విజయ విశ్వసనీయ వారసత్వం రోగులకు సమర్థవంతమైన సేవలందించేందుకు దోహదపడుతాయని పేర్కొన్నాయి. విజయ మెడికల్ ప్రస్తుతం ఏపీలోని 8 నగరాల్లో 18 కేంద్రాల ద్వారా పాథాలజీ, రేడియాలజీ, మాలిక్యులర్ ఇమేజింగ్ సర్వీసులు అందిస్తోంది. కాగా న్యూబర్గ్ తెలుగు రాష్ట్రాల్లోని 10 నగరాల్లో పాథాలజీ లాబ్స్‌తో పాటు కలెక్షన్ సెంటర్లను నిర్వహిస్తోంది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి