నయా ఫండ్స్
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:01 AM
బజాజ్ ఫిన్‌సర్వ్ మల్టీ క్యాప్ ఫండ్, ఐటీఐ భారత్ కంజంప్షన్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా బిజినెస్ సైకిల్ ఫండ్...

నయా ఫండ్స్
బజాజ్ ఫిన్‌సర్వ్ మల్టీ క్యాప్ ఫండ్
బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ.. మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50ః25ః25 టీఆర్‌ఐ ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ముగింపు తేదీ ఈ నెల 20.
ఐటీఐ భారత్ కంజంప్షన్ ఫండ్
ఐటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. ఐటీఐ భారత్ కంజంప్షన్ ఫండ్‌ను తీసుకువచ్చింది. వినియోగం, ఇతర అనుబంధ రంగాల్లో ఉన్న కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు అందించే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 20.
ఇన్వెస్కో ఇండియా బిజినెస్ సైకిల్ ఫండ్
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. ఇండియా బిజినెస్ సైకిల్ ఫండ్ పేరుతో కొత్త ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాన్ని తీసుకువచ్చింది. వివిధ రంగాల్లో కీలకంగా ఉన్న కంపెనీల్లోని ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఈ ఫండ్‌కు బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ 20. కనీస పెట్టుబడి రూ.1,000. సిప్ రూపంలో అయితే కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..