Share News

New Labour Code: కొత్త కార్మిక చట్టాలతో టేక్ హోమ్ శాలరీపై ప్రభావం.. కారణమిదే..

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:36 PM

దేశంలో ఇటీవల మోదీ సర్కార్ అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలతో ఉద్యోగి టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుందా? అయితే దీనికి కారణం ఏమిటి.?

New Labour Code: కొత్త కార్మిక చట్టాలతో టేక్ హోమ్ శాలరీపై ప్రభావం.. కారణమిదే..
New labour code

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలతో ఉద్యోగి టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుందా.? అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్మిక చట్టాల నియమాల ప్రకారం.. ఆయా కంపెనీలు ఉద్యోగికి చెల్లించే మొత్తం వేతనంలో కనీసం సగభాగాన్ని మూల వేతనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అనుసరించి అనేక కంపెనీలు.. తమ సిబ్బందికి చెల్లించే జీతం విధానాలను పునర్‌వ్యవస్థీకరించే అవకాశముంది. దీంతో ఉద్యోగి పొందే టేక్ హోమ్ నగదుపై ప్రభావం పడనుంది. మిగిలిన సొమ్ము పీఎఫ్ పొదుపు ఖాతాలో జమవుతుంది. ఈ సొమ్మును సదరు ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పొందేందుకు వెసులుబాటు ఉంటుంది.


ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్, గ్రాట్యుటీని ప్రాథమిక వేతనం కింద లెక్కిస్తారు. ఎక్కువ మూలధన వేతనం కలిగిన ఉద్యోగి.. తన జీతం సహా కంపెనీ యాజమాన్యం చెల్లించే నగదుతో ఎక్కువ మొత్తంలో పీఎఫ్, గ్రాట్యుటీలకు జమవుతుంది. ఇది ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఎక్కువ మొత్తం పొందేందుకు తోడ్పడుతుంది. కానీ నూతన నిబంధనల ప్రకారం.. ఇకపై ఈ రెండింటినీ ఉద్యోగి సీటీసీ నుంచే కట్ అవుతుంది. దీంతో ఉద్యోగి పొందే టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుంది.


1. వేతనాలకు సంబంధించిన కోడ్ 2019(Code on Wages, 2019)

2. శ్రామిక యూనియన్‌లు, ఉద్యోగ వివాదాల నియమాల కోడ్ 2020(Industrial Relations Code, 2020)

3. సాంఘిక భద్రతా ప్రయోజనాలైన ఇన్స్యూరెన్స్, పీఎఫ్, వైద్యానికి సంబంధించిన కోడ్ 2020 (Code on Social Security, 2020)

4. పని స్థలంలో భద్రత, ఆరోగ్యం, పని షరతుల నియంత్రణ కోడ్ 2020(Occupational Safety, Health & Working Conditions (OSHWC)

మోదీ సర్కార్ తెచ్చిన ఈ నూతన కార్మిక కోడ్‌లు.. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. కార్మికుల రక్షణను పటిష్ఠం చేయడం సహా నేటి అవసరాలకు అనుగుణంగా కార్మిక వ్యవస్థను సరళీకృతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. రాబోయే 45 రోజుల్లో ఆయా కంపెనీలు ఈ నూతన నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల జీత భత్యాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు

53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ నేడే ప్రమాణ స్వీకారం

Updated Date - Nov 24 , 2025 | 12:40 PM