NephroCare Health Services: నెఫ్రోప్లస్ రూ 2000 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:51 AM
నెఫ్రోప్లస్ బ్రాండ్ నేమ్‌తో డయాలసిస్ సేవలందిస్తోన్న హైదరాబాద్ కంపెనీ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు...
నెఫ్రోప్లస్ బ్రాండ్ నేమ్‌తో డయాలసిస్ సేవలందిస్తోన్న హైదరాబాద్ కంపెనీ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ త్వరలోనే ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా రూ.2,000 కోట్లకు పైగా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నిధులతో మరిన్ని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు భారత్, ఫిలిప్పీన్స్‌లో ఇతర కంపెనీలను కొనుగోలు చేయాలనుకుంటోంది. 2010లో ప్రారంభమైన నెఫ్రోప్లస్.. ప్రస్తుతం భారత్, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్థాన్, నేపాల్ మార్కెట్లలో 400కు పైగా డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి