ఎన్‌సీసీ లాభంలో క్షీణత
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:37 AM
డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,382.86 కోట్ల ఆదాయం పై రూ.193.18 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,382.86 కోట్ల ఆదాయం పై రూ.193.18 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.220.65 కోట్లుగా ఉండగా ఆదాయం రూ.5,287.74 కోట్లుగా ఉంది. కాగా స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.4,719.75 కోట్ల ఆదాయంపై రూ.185.40 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను రూ.16,165.55 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.566.06 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కాగా డిసెంబరు ముగిసే నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ రూ.55,548 కోట్లుగా ఉంది.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News