Share News

NMIA Launch: నవీ ముంబై విమానాశ్రయం షురూ

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:56 AM

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఎంఐఏ) గురువారం లాంఛనంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో...

NMIA Launch: నవీ ముంబై విమానాశ్రయం షురూ

ముంబై: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఎంఐఏ) గురువారం లాంఛనంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్‌బస్‌ ఏ320 విమానానికి వాటర్‌ క్యానన్స్‌తో స్వాగతం పలకటం ద్వారా ఈ విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని అదానీ గ్రూప్‌ సారథ్యంలోని ఎన్‌ఎంఐఏ వెల్లడించింది. అలాగే ఇక్కడి నుంచి తొలి విమాన సర్వీసు హైదరాబాద్‌కు బయలుదేరిందని తెలిపింది. తొలుత ఈ విమానాశ్రయం నుంచి 9 ప్రధాన నగరాలకు కనెక్టివిటీని అందుబాటులోకి తీసకువచ్చారు. ఇండిగో, ఎయర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌, స్టార్‌ ఎయిర్‌ వంటి విమాన కంపెనీలను ఇక్కడి నుంచి సర్వీసులను నిర్వహించనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 04:56 AM