Share News

Nava Limited Quarterly Results: నవ లిమిటెడ్‌ లాభం రూ 399 కోట్లు

ABN , Publish Date - Aug 15 , 2025 | 02:34 AM

నవ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,232.60 కోట్ల మొత్తం ఆదాయంపై...

Nava Limited Quarterly Results: నవ లిమిటెడ్‌ లాభం రూ 399 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నవ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,232.60 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.399.10 నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 2 శాతం, లాభం 10.5 శాతం తగ్గింది. అయితే గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోల్చితే మాత్రం ఆదాయం 16.7 శాతం, లాభం 31.8 శాతం వృద్ధి చెందింది. కాగా స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.572.70 కోట్ల ఆదాయంపై రూ.141 కోట్ల లాభాన్ని ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో మెటల్స్‌ వ్యాపారంతో పాటు ఎనర్జీ పోర్టుఫోలియో పనితీరు మెరుగ్గా ఉండటం కలిసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే జాంబియాలోని విద్యుత్‌ డివిజన్‌ మాంబా ఎనర్జీ లిమిటెడ్‌ (ఎంఈఎల్‌)కు సంబంధించి 50 శాతం ట్యాక్స్‌ కన్సెషన్స్‌ అమలు చేయటం కంపెనీపై కొంత మేర ప్రభావం చూపించిందని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 02:35 AM