Natco Pharma, Q1 Results: తగ్గిన నాట్కో లాభం
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:31 AM
నాట్కో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.480 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.668 కోట్లతో పోల్చితే...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నాట్కో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.480 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.668 కోట్లతో పోల్చితే 28 శాతం క్షీణించింది. అమెరికా ఉత్పత్తుల పోర్టుఫోలియోపై ధరల ఒత్తిడి, ఆర్ అండ్ డీ వ్యయాలు గణనీయంగా పెరగటం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.1,410 కోట్ల నుంచి రూ.1,390 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో కంపెనీ ఏపీఐ వ్యాపారం రూ.52.6 కోట్లుగా ఉండగా దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారం రూ.107 కోట్లు, ఫార్ములేషన్స్ ఎగుమతులు రూ.1,126.50 కోట్లుగా ఉన్నాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ బోర్డు రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి