Share News

జియో నా జీవితంలోనే అతిపెద్ద రిస్క్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:40 AM

రిలయన్స్‌ జియో ద్వారా 2016లో టెలి కం రంగంలోకి పునఃప్రవేశించడం తాను జీవితం తీసుకున్న అతిపెద్ద రిస్క్‌ అని ముకేశ్‌ అంబానీ అభివర్ణించారు. ఒకవేళ విశ్లేషకులు...

జియో నా జీవితంలోనే అతిపెద్ద రిస్క్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ద్వారా 2016లో టెలి కం రంగంలోకి పునఃప్రవేశించడం తాను జీవితం తీసుకున్న అతిపెద్ద రిస్క్‌ అని ముకేశ్‌ అంబానీ అభివర్ణించారు. ఒకవేళ విశ్లేషకులు అంచనా వేసినట్లు రిలయన్స్‌ జియో ఆర్థికంగా విఫలమైనప్పటికీ, భారత్‌ను డిజిటలీకరించడంలో పోషించిన పాత్రకుగాను కంపెనీ ఇప్పటికీ విలువైనదిగా ఉండేదన్నారు. అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సేవల దిగ్గజం ‘మెకిన్సే అండ్‌ కో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో 4జీ సేవల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వేల కోట్ల రూపాయల సొంత నిధులను పెట్టుబడిగా పెట్టిందన్నారు. జియో ప్రస్తుతం 47 కోట్లకు పైగా కస్టమర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా ఉంది.

డీప్‌ టెక్‌ కంపెనీగా మారడమే లక్ష్యం: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతి 3-5 ఏళ్లకోసారి వ్యాపారంలో ఆర్జించిన రాబడితో తిరిగి పెట్టుబడులు పెడుతుందని ముకేశ్‌ అంబానీ అన్నారు. అలాగే, డీప్‌ టెక్నాలజీ, ఆధునిక మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీగా ఎదగాలన్నదే రిలయన్స్‌ లక్ష్యమని ఆయన అన్నారు.

జియోహాట్‌స్టార్‌ కస్టమర్లు 30 కోట్లు: రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియోహాట్‌స్టార్‌ మొత్తం చందాదారుల సంఖ్య 30 కోట్లకు చేరింది. ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ చివరగా ప్రకటించిన 30.16 కోట్ల మంది కస్టమర్ల సంఖ్యకు చేరువైనట్లు కంపెనీ బుధవారం తెలిపింది.

ఇవీ చదవండి:

1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:40 AM