MUFG Acquires 2 Percent Stake: శ్రీరామ్ ఫైనాన్స్‌లో ఎంయూఎఫ్‌జీకి 20 శాతం వాటా
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:15 AM
భారత ఆర్థిక సేవల రంగంలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. దేశంలో రెండో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 20 శాతం వాటాను...
దేశీయ ఆర్థిక సేవల రంగంలో మెగా డీల్
ఒప్పందం విలువ రూ.39,618 కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక సేవల రంగంలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. దేశంలో రెండో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 20 శాతం వాటాను జపాన్‌కు చెందిన మిత్సుబిషి యూఎ్‌ఫజే ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్ (ఎంయూఎఫ్‌జీ) రూ.39,618 కోట్లకు దక్కించుకుంది. దేశీయ ఆర్థిక సేవల రంగంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. అంతేకాదు, ఎంయూఎఫ్‌జీకి కూడా భారత్‌లో ఇదే అతిపెద్ద ఇన్వె్‌స్టమెంట్. ఫ్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా వాటా విక్రయం జరగనుందని శ్రీరామ్ ఫైనాన్స్ శుక్రవారం వెల్లడించింది. ఎంయూఎఫ్‌జీతో ఒప్పందం దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం బలమైన మూలాలు, భవిష్యత్ వృద్ధి అవకాశాలపై నమ్మకాన్ని బలపరుస్తుందని తన ప్రకటనలో పేర్కొంది. అలాగే, తమ మూలధన నిధులను, వృద్ధిని బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఎంయూఎఫ్‌జీ పెట్టుబడులకు శ్రీరామ్ ఫైనాన్స్ షేర్‌హోల్డర్లతో పాటు ఆర్‌బీఐ, సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) వంటి నియంత్రణ మండళ్లు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
4 శాతం పెరిగిన షేరు
జపాన్ కంపెనీతో ఒప్పందం నేపథ్యంలో శ్రీరామ్ ఫైనాన్స్ షేరు ధర ఎఫ్ బీఎఫ్‌ఈలో ఒక దశలో 5.16 శాతం వరకు ఎగబాకి రూ.914.10 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 3.74 శాతం వృద్ధితో రూ.901.75 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,154.63 కోట్లు పెరిగి రూ.1,69,651.83 కోట్లకు చేరుకుంది.
130 ఏళ్ల క్రితమే భారత్‌కు ఎంయూఎఫ్‌జీ
ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ మాతృసంస్థ అయిన ఎంయూఎఫ్‌జీ 130 ఏళ్ల (1894 నుంచే) క్రితం నుంచే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 170 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులతో పాటు దాదాపు 5,000 ఉద్యోగాలనూ కల్పించిందీ జపాన్ ఆర్థిక దిగ్గజం. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో శాఖను ఏర్పాటు చేసిన తొలి జపాన్ బ్యాంక్ కూడా ఇదే. తాజా డీల్‌తో దేశీయ ఆర్థిక రంగంలో ఎంయూఎఫ్‌జీ మనుగడ మరింత పెరగనుంది. దేశీయ స్టార్ట్‌పలకు మద్దతుగా ఈ కంపెనీ 2022లో 30 కోట్ల డాలర్లతో గణేశ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2023లో డిజిటల్ రుణ సంస్థ డీఎంఐ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 33.85 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ ఎంయూఎఫ్‌జీసీలోనూ 20 శాతం వాటా కలిగి ఉంది.
రెండో ప్రయత్నమిది: దేశీయ ఎన్‌బిఎఫ్‌సీ రంగంలో భారీ కొనుగోలుకు ఎంయూఎఫ్‌జీ చేసిన రెండో ప్రయత్నమిది. గత ఏడాది సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ విభాగమైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 200 కోట్ల డాలర్ల విలువైన వాటా కొనుగోలుకు ప్రయత్నించినప్పటికీ, సఫలం కాలేకపోయింది.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్