Share News

Mtar Technologies Order: ఎంటార్‌ టెక్నాలజీస్‌కు రూ.310 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:23 AM

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) కర్ణాటకలో నిర్మిస్తున్న కైగా అణు కేంద్రానికి...

Mtar Technologies Order: ఎంటార్‌ టెక్నాలజీస్‌కు రూ.310 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) కర్ణాటకలో నిర్మిస్తున్న కైగా అణు కేంద్రానికి అవసరమైన పరికరాల సరఫరా కోసం ఎంటార్‌ టెక్నాలజీ్‌సకు రూ.310 కోట్ల విలువ గల ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ కింద కైగా 5,6 సివిల్‌ అణు రియాక్టర్లకు వివిధ పరికరాలను 2030 ఫిబ్రవరి లోగా దశల వారీగా ఎంటార్‌ టెక్నాలజీస్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ రియాక్టర్ల కోసం పరికరాల సరఫరాకు ఇంతకు ముందే తమకు రూ.194 కోట్ల ఆర్డర్‌ లభించిందని, కొత్త ఆర్డర్‌తో కలిసి మొత్తం ఆర్డర్‌ విలువ రూ.504 కోట్లకు చేరుకుందని ఎంటార్‌ ఎండీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎంటార్‌ టెక్నాలజీ్‌సకు హైదరాబాద్‌లో ఎగుమతి ఆధారిత యూనిట్‌ సహా మొత్తం 9 తయారీ యూనిట్లున్నాయి.

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 19 , 2025 | 03:23 AM