Share News

Modi Government: అదానీలపై మోదీ సర్కారు ప్రేమ

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:37 AM

నరేంద్ర మోదీ సర్కారు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన దగ్గరి బంధువు సాగర్‌ అదానీలపై అలవిమాలిన ప్రేమ చూపిస్తోందని అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజీ కమిషన్‌...

Modi Government: అదానీలపై మోదీ సర్కారు ప్రేమ

సమన్లు అందించడంలో అలసత్వం..అమెరికా ఎస్‌ఈసీ

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన దగ్గరి బంధువు సాగర్‌ అదానీలపై అలవిమాలిన ప్రేమ చూపిస్తోందని అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజీ కమిషన్‌ (ఎస్‌ఈసీ) పరోక్షంగా ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం వీరు ముడుపులు చెల్లించినట్టు వచ్చిన ఆరోపణలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము జారీ చేసిన సమన్లను.. మోదీ సర్కారు ఇప్పటికీ వారికి అందజేయలేదని న్యూయార్క్‌లోని ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి జేమ్స్‌ ఆర్‌ చో కి ఎస్‌ఈసీ తెలిపింది. గత ఏడాది నవంబరులో అదానీలపై తాము నమోదు చేసిన కేసుకు సంబంధించిన సమన్లను భారత్‌లో ఉంటున్న అదానీలకు అందజేయాలంటే భారత ప్రభుత్వ సహాయం తప్పనిసరని పేర్కొంది. వీరికి సమన్లు అందజేయమని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతున్నా ఇప్పటి వరకు ఉలుకూపలుకు లేదని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 01:37 AM