Share News

Samvat 2082: స్వల్ప లాభాలతో సంవత్‌ 2082కి స్వాగతం

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:59 AM

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌ మందకొడిగా సాగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నడుమ ఈక్విటీ సూచీలు...

Samvat 2082: స్వల్ప లాభాలతో సంవత్‌ 2082కి స్వాగతం

సెన్సెక్స్‌ 63 పాయింట్లు. నిఫ్టీ 25 పాయింట్లు అప్‌

ముంబై: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌ మందకొడిగా సాగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నడుమ ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సంవత్‌ 2082కు స్వాగతం పలుకుతూ మంగళవారం మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 మధ్యలో నిర్వహించిన ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 62.97 పాయింట్ల లాభంతో 84,426.34 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 84,665.44 పాయింట్ల గరిష్ఠ స్థాయిని, 84,286.40 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 25.45 పాయింట్ల లాభంతో 25,868.60 వద్ద క్లోజైంది. సంవత్‌ 2082 ప్రారంభమవుతున్న శుభ సమయాన ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొత్త పద్దు పుస్తకాలు తెరిచారు.

  • బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ 0.23% లాభంతో 46,787.20 వద్ద, స్మాల్‌క్యాప్‌ 0.91% లాభంతో 53,842.85 వద్ద ముగిశాయి. రంగాలవారీ సూచీల్లో ఇండస్ర్టియల్స్‌, టెలి కమ్యూనికేషన్‌, కమోడిటీస్‌, యంత్రపరికరాలు, సర్వీసెస్‌, మెటల్‌ సూచీలు లాభపడగా బ్యాంకెక్స్‌, రియల్టీ స్వల్పంగా నష్టపోయాయి.

  • సోమవారంతో ముగిసిన సంవత్‌ 2081లో సెన్సెక్స్‌ 4974.31 పాయింట్లు (6.26ు), నిఫ్టీ 1637.8 పాయింట్లు (6.76ు) లాభపడ్డాయి. సోమవారం సెన్సెక్స్‌ 411.18 పాయింట్లు, నిఫ్టీ 133.30 పాయింట్లు లాభపడ్డాయి.

నేడు మార్కెట్లకు సెలవు

బలిప్రతిపాద పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం స్టాక్‌ మార్కెట్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు సెలవు. ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పని చేయవు. గురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

ముహూరత్‌ ట్రేడింగ్‌ సందర్భంగా గంట కొట్టి ట్రేడింగ్‌ను ప్రారంభిస్తున్న ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌

ఇవి కూడా చదవండి

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం

Updated Date - Oct 22 , 2025 | 01:59 AM