Weekly Stock Recommendations: మిశ్రమంగా కదలాడే చాన్స్
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:21 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రావటం లేదు. సూచీలకు చోదక శక్తిగా ...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రావటం లేదు. సూచీలకు చోదక శక్తిగా పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలో మదుపరులు ఎంపిక చేసిన షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయి వద్ద కదలాడుతున్నప్పటికీ మార్కెట్ బ్రెడ్త్ మెరుగ్గా లేకపోవటం గమనార్హం. తీవ్రమైన ఒడుదొడుకులకు ఇది ఆస్కారం ఇస్తోంది.
స్టాక్ రికమండేషన్స్
ఐఆర్‌సీటీసీ: గత ఏడాది జూలై నుంచి 45 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం ఆకర్షణీయమైన జోన్‌లో ఉన్నాయి. కీలకమైన రూ.680 మద్దతు స్థాయి వద్ద కదలాడుతున్నాయి. భారతీయ రైల్వే చార్జీలను పెంచటంతో ఈ షేర్లపై ఆసక్తి నెలకొంది. గత శుక్రవారం రూ.705 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.700/690 శ్రేణిలో ప్రవేశించి రూ.755 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.675 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టైటాన్: కొన్ని నెలల కన్సాలిడేషన్ తర్వాత ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. అక్టోబరు నుంచి 22 శాతం మేర రాబడి అందించింది. ఈపీఎస్ సైతం మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.3,992 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,960 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.4,150 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.3,910 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎన్‌ఎండీసీ: ఈ కౌంటర్‌లో చక్కని కన్సాలిడేషన్ పూర్తయింది. 2011 నాటి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.82.61 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.80 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.88 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.78 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: గత ఏడాది జూలై నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. దాదాపు 45 శశాఆతతం మేర పతనమైంది. ప్రస్తుతం కీలకమైన రూ.500 మద్దతు స్థాయి వద్ద చలిస్తోంది. గత శుక్రవారం రూ.520.30 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.500/510 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.570 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.490 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఐఆర్‌ఈడీఏ: గత ఏడాది జూలై నుంచి ఈ షేరు భారీగా పతనమవుతూ వస్తోంది. ఏకంగా 57 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం కీలకమైన రూ.130 మద్దతు స్థాయి వద్ద టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.140 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.140 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.155/165 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.138 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
ఇవీ చదవండి
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత