Zero Return From AI Investments: ఎమ్ఐటీ సంచలన నివేదిక.. ఏఐతో నష్టపోతున్న వ్యాపారాలు..
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:43 PM
ఏఐల ద్వారా వ్యక్తిగత ఉత్పాదక పెరిగింది. కానీ, ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ విషయంలో ఏఐ తన సత్తా చాటలేకపోయింది.
ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పది మంది చేసే పని ఏఐ ఒక్కటే చేసేస్తోంది. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదాయం పెంచుకోవడానికి ఏఐని వాడుకుంటున్నాయి. కంపెనీల ఏఐ వాడకంపై అమెరికాకు చెందిన మాసాచుషెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) సంచలన నివేదికను ప్రచురించింది. ఏఐ వాడుకుని తయారు చేసిన ప్రాజెక్టులు చాలా వరకు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయని ఆ నివేదికలో వెల్లడైంది. ఏఐ సిస్టమ్స్ వాడిన 95 శాతం సంస్థలు భారీగా నష్టపోయాయని తెలిపింది.
ఒక్కపైసా కూడా ఆదాయం పొందలేకపోయాయని పేర్కొంది. పరిశోధకులు మొత్తం 300 సంస్థలపై పరిశోధనలు చేశారు. 350 మంది ఉద్యోగులతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో సంస్థలు చాట్ జీపీటీ, కోపైలట్ వాడుతున్నట్లు తేలింది. కేవలం 5 శాతం ఏఐ పైలట్లు మాత్రమే పెట్టిన పెట్టుబడిపై ఆదాయాన్ని సృష్టిస్తున్నాయని వెల్లడైంది. మిగిలిన 95 శాతం ఏఐ పైలట్ల ద్వారా ఒక్క పైసా కూడా ఆదాయం లేదని స్పష్టం అయింది. 80 శాతం సంస్థలు 40 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించి వారి స్థానంలో ఏఐని వాడటం మొదలెట్టాయి.
ఏఐల ద్వారా వ్యక్తిగత ఉత్పాదక పెరిగింది. కానీ, ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ విషయంలో ఏఐ తన సత్తా చాటలేకపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సదరు సంస్థలు ఆదాయం గడించలేకపోవడానికి కారణం ఏఐలు సరిగా పనిచేయకపోవటం కాదు. కంపెనీ వర్కింగ్ స్టైల్‌ను ఏఐలు ఒంటబట్టించుకోలేకపోయాయి. లెర్నింగ్ గ్యాప్ వల్ల ఏఐ వెనుకబడుపోతోంది. దీంతో కంపెనీలు ఏఐలను తప్పుబడుతున్నాయి. మళ్లీ మనుషులను పనిలోకి తీసుకోవటం మొదలెట్టాయి. దీన్ని బట్టి చూస్తే.. అన్ని రంగాల్లో ఏఐని వాడటం సరైన నిర్ణయం కాదని స్పష్టం అవుతోంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ వైద్య విద్య.. స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఇండక్షన్ స్టవ్ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నారా? ఈ తప్పు చేయకండి..