Share News

జెన్‌సోల్‌ బ్లూస్మార్ట్‌పై కార్పొరేట్‌ శాఖ దర్యాప్తు

ABN , Publish Date - May 07 , 2025 | 05:38 AM

కంపెనీల చట్టం ఉల్లంఘనల ఆరోపణలకు సంబంధించి జెన్‌సోల్‌ ఇంజనీరింగ్‌, బ్లూస్మార్ట్‌ మొబిలిటీపై దర్యాప్తునకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రమోటర్లు పెద్దఎత్తున నిధుల దుర్వినియోగానికి...

జెన్‌సోల్‌ బ్లూస్మార్ట్‌పై కార్పొరేట్‌ శాఖ దర్యాప్తు

న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ఉల్లంఘనల ఆరోపణలకు సంబంధించి జెన్‌సోల్‌ ఇంజనీరింగ్‌, బ్లూస్మార్ట్‌ మొబిలిటీపై దర్యాప్తునకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రమోటర్లు పెద్దఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో ఈ రెండు కంపెనీలూ ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నాయి. నిధుల మళ్లింపుతోపాటు కార్పొరేట్‌ పాలన ప్రమాణాలను అతిక్రమించినందుకు గాను జెన్‌సోల్‌ ఇంజనీరింగ్‌, బ్లూస్మార్ట్‌ ప్రమోటర్లైన అన్‌మోల్‌ సింగ్‌ జగ్గీ, పునీత్‌ సింగ్‌ జగ్గీ సోదరులను సెబీ ఇప్పటికే సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధించింది. కాగా, ఈ రెండు కంపెనీల పద్దులు, ఆర్థిక పత్రాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సమీక్షిస్తోంది. ఆ ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, జెన్‌సోల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు జరుపుతోంది.

ఇవి కూడా చదవండి:

Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్

ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 05:38 AM