మైక్రోసాఫ్ట్‌లో మరో 9000 ఉద్యోగాల కోత
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:18 AM
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపకర్త మైక్రోసాఫ్ట్ వ్యయ నియంత్రణలో భాగంగా మరో విడత భారీ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది...
రెడ్‌మాండ్(అమెరికా): అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపకర్త మైక్రోసాఫ్ట్ వ్యయ నియంత్రణలో భాగంగా మరో విడత భారీ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. ఈ సారి కంపెనీ మొత్తం సిబ్బంది 2.28 లక్షల మందిలో 4 శాతానికి సమానమైన 9,100 మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం నుంచే వారికి పింక్ స్లిప్‌లు ఇవ్వడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ కార్యాలయాల్లోని ఉద్యోగులపై ఇది ప్రభావం చూపనుందని, ప్రధానంగా సేల్స్, ఎక్స్‌బాక్స్ వీడియో గేమ్ విభాగాల్లో అధిక కోతలుంటాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. మే నెలలో దాదాపు 6,000 మందిని బయటికి సాగనంపింది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి