Public Sector Insurance Companies: మళ్లీ తెరపైకి బీమా కంపెనీల విలీన ప్రతిపాదన
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:09 AM
ప్రభుత్వ రంగంలోని మూడు బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మూడు బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్థిక పరిసితి మెరుగైనందున ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేసి ఒకే కంపెనీగా చేయాలని ప్రభు త్వం యోచిస్తున్నట్టు సమాచారం. నిజానికి 2018-19 ఆర్థి క సంవత్సరంలోనే అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ప్రతిపాదన తెచ్చారు. ఈ లోగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ కంపెనీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభు త్వం 2019-22 మధ్య కాలంలో రూ.17,450 కోట్ల నిధులు కూడా సమకూర్చింది. ప్రైవేటుపరం చేస్తే ఉద్యోగ సంఘా ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున, ఈ మూడు ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను ఒకటిగా విలీనం చేయడమే మంచిదని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి