Megha Engineering: మేఘా ఇంజనీరింగ్ చేతికి టీఏక్యూఏ నైవేలీ పవర్ ప్లాంట్
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:02 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్).. తమిళనాడులోని టీఏక్యూఏ నైవేలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ను చేజిక్కించుకుంది...
అబుదాబీ కంపెనీ నుంచి 100 శాతం వాటా కొనుగోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్).. తమిళనాడులోని టీఏక్యూఏ నైవేలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ను చేజిక్కించుకుంది. అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పీజేఎ్‌ససీ (టీఏక్యూఏ) నుంచి 100 శాతం వాటాలను అనుబంధ సంస్థ ఎంఈఐఎల్ ఎనర్జీ కొనుగోలు చేసిందని మేఘా ఇంజనీరింగ్ వెల్లడించింది. అయితే ఎంత మొత్తానికి ఈ వాటాను కొనుగోలు చేసిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. టీఏక్యూఏ నైవేలీ పవర్ ప్లాంట్ ప్రస్తుతం తమిళనాడులో 250 మెగావాట్ల సామర్థ్యం గల లిగ్నైట్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు టీఏక్యూఏ నైవేలీ ఇప్పటికే దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇప్పటికే ఎంఈఐఎల్‌కు ఉన్న 5,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల పోర్టుఫోలియోను ఈ కొనుగోలుతో మరింతగా విస్తరించే అవకాశం లభిస్తుందని తెలిపింది. వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఇంధన రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే అవకాశం లభించనుందని ఎంఈఐఎల్ గ్రూప్ సీఎ్‌ఫఓ సలీల్ కుమార్ మిశ్రా తెలిపారు. థర్మల్, హైడ్రో, పునరుత్పాదక ఇంధన వనరులన్నింటితో కూడిన సమతూకమైన, సుస్థిర పోర్టుఫోలియో అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని మిశ్రా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News