Share News

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్‌ జీసీసీ

ABN , Publish Date - Jan 31 , 2025 | 02:41 AM

అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌..హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది మధ్య నాటికి ఈ సెంటర్‌ను అందుబాటులోకి...

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్‌ జీసీసీ

అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌..హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది మధ్య నాటికి ఈ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ సెంటర్‌ ఏర్పాటు కోసం ఆర్‌ఎంజెడ్‌ నెక్సిటీ టవర్‌ 20లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు అంతస్తులు లీజుకి తీసుకుంది. అమెరికాకు వెలుపల మెక్‌ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇందులో 2,000 మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 02:41 AM