Maruti Suzuki Enters Top 10: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో మారుతి సుజుకీ 8
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:52 AM
మాతృసంస్థను కూడా అధిగమించి ముందుకు దేశంలోని అతి పెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో టాప్ 10లోకి...
మాతృసంస్థను కూడా అధిగమించి ముందుకు దేశంలోని అతి పెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో టాప్ 10లోకి దూసుకుపోయింది. 5,760 కోట్ల డాలర్ల (రూ.5.11 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో ప్రపంచంలో మార్కెట్ విలువపరంగా అత్యంత విలువైన కంపెనీల్లో 8వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ స్థాయి ఆటో దిగ్గజాలైన ఫోర్డ్ మోటార్స్ (4,630 కోట్ల డాలర్లు), జనరల్ మోటార్స్ (5,710 కోట్ల డాలర్లు), ఫోక్స్‌వేగన్ ఏజీ (5,570 కోట్ల డాలర్లు) కంపెనీలను దాటిపోయింది. చివరికి జపాన్‌కు చెందిన మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌ను (2,900 కోట్ల డాలర్లు) కూడా మారుతి సుజుకీ వెనక్కి నెట్టేసింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఫెస్టివల్ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే 38 కోట్లకు పైగా కస్టమర్లు పోర్టల్‌ను సందర్శించటమే కాకుండా కొనుగోళ్లు చేపట్టినట్లు వెల్లడించింది.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ నిర్వహణలోని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) గత నెల 31 నాటికి రూ.5,410.04 కోట్లకు చేరుకున్నాయి. ఫండ్ ప్రారంభించిన రెండేళ్ల కాలంలో ఈ మైలురాయిని అందుకోవటం విశేషం.
పండగల సీజన్‌ను పురస్కరించుకుని ఎల్ అండ్ టీ ఫైనాన్స్.. ద్విచక్ర వాహనాల కోసం ఆకర్ణణీయమైన రుణ పథకాలను తీసుకువచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ, ప్రాంప్ట్ పేమెంట్ రిబేట్, ఈఎంఐ లైట్ ఫెస్టివ్ వంటి ఆఫర్లను అందిస్తోంది.
ప్రపంచంలో టాప్ 8 ఆటో కంపెనీలు
కంపెనీ మార్కెట్ విలువ
(డాలర్లలో)
టెస్లా 147 లక్షల కోట్లు
టయోటా 31,400 కోట్లు
బీవైడీ 13,300 కోట్లు
ఫెరారీ ఎన్‌వీ 9,270 కోట్లు
బీఎండబ్ల్యూ 6,130 కోట్లు
మెర్సిడెస్ బెంజ్ 5,980 కోట్లు
హోండా మోటార్ 5,900 కోట్లు
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News