Maruti Suzuki India: మారుతి 3 కోట్ల అమ్మకాల మైలురాయి
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:34 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మరో రికార్డును సొంతం చేసుకుంది. కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటికి దేశీయ మార్కెట్లో 3 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త మైలురాయిని అధిగమించింది....
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మరో రికార్డును సొంతం చేసుకుంది. కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటికి దేశీయ మార్కెట్లో 3 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త మైలురాయిని అధిగమించింది. మొదటి 1 కోటి విక్రయాల మార్కును సాధించడానికి 28 సంవత్సరాల 2 నెలలు పట్టగా, తదుపరి 1 కోటి యూనిట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల్లో చేరింది. తాజాగా మరో 1 కోటి యూనిట్లు కేవలం 6 సంవత్సరాల 4 నెలల్లోనే విక్రయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. ఈ మూడు కోట్ల అమ్మకాల్లో, ఆల్టో 47 లక్షలకు పైగా యూనిట్లతో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. వ్యాగన్ ఆర్ (34 లక్షల యూనిట్లు), స్విప్ట్ (32 లక్షల యూనిట్లు) కార్లు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 1983 డిసెంబర్‌లో ఐకానిక్ మారుతి 800 తో ప్రారంభమైన కంపెనీ ప్రస్థానం, నేడు 19 మోడళ్లలో 170కి పైగా వేరియంట్లతో దేశంలో అగ్రగామిగా కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి