Maruti Suzuki: 4 లక్షల యూనిట్ల ఎగుమతి లక్ష్వం సాధిస్తాం
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:37 AM
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసే లక్ష్యం దిశ గా దూసుకెళ్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో...
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసే లక్ష్యం దిశ గా దూసుకెళ్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఇప్పటికే 2 లక్షలకు పైగా యూనిట్లను విదేశాలకు పంపించినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో ఎగుమతులు గత ఏడాదితో పోలి స్తే 52ు పెరిగి 42,204 యూనిట్లకు చేరాయి. ‘మొదటి త్రైమాసికంలో దాదాపు 1.10 లక్షల యూనిట్లు, ప్రఽథమార్ధంలో 2.07 లక్షల యూనిట్లను ఎగుమతి చేశాం. ఇదే వేగాన్ని కొనసాగిస్తే, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న 4 లక్షల యూనిట్ల ఎగుమతి లక్ష్యాన్ని తప్పక చేరుకుంటాం అని ఆయన అన్నారు. తమ ఎగుమతులు దేశీయ పోటీదారుల కంటే రెండింతలు ఎక్కువే ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి