Share News

Sensex Crash: మార్కెట్లో మళ్లీ టారిఫ్‌ కల్లోలం

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:26 AM

భారతీయ వస్తువులపై అమెరికాలో బుధవారం నుంచి అమల్లోకి రానున్న 25ు అదనపు టారి్‌ఫలు ఈక్విటీ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి. అదనపు టారి్‌ఫలకు సంబంధించి అమెరికా ముసాయిదా నోటీసు జారీ చేయడంతో...

Sensex Crash: మార్కెట్లో మళ్లీ టారిఫ్‌ కల్లోలం

81,000 దిగువకు సెన్సెక్స్‌

రూ.5.41 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: భారతీయ వస్తువులపై అమెరికాలో బుధవారం నుంచి అమల్లోకి రానున్న 25ు అదనపు టారి్‌ఫలు ఈక్విటీ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి. అదనపు టారి్‌ఫలకు సంబంధించి అమెరికా ముసాయిదా నోటీసు జారీ చేయడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పరుగులు తీశారు. ఫలితంగా సెన్సెక్స్‌ 849.37 పాయింట్లు నష్టపోయి 80,786.54 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 25 నష్టాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో సూచీ 949.93 పాయిం ట్లు నష్టపోయి 80,685.98 వరకు దిగజారింది. బీఎ్‌సఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్క రోజులోనే రూ.5,41,542.83 కోట్లు నష్టపోయి రూ.449 లక్షల కోట్లకు దిగజారింది. మరోవైపు నిఫ్టీ 255.70 పాయింట్ల నష్టంతో 24,712.05 వద్ద క్లోజైంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కూడా డాలర్‌ మారకంలో 13 పైసలు దిగజారి 87.69 వద్ద ముగిసింది.

నేడు మార్కెట్లకు సెలవు

బుధవారం వినాయక చవితి సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ సహా కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పనిచేయవు. గురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ మెగా డీల్‌

ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 05:26 AM