Share News

Manufacturing Surge: 10 నెలల గరిష్ఠానికి తయారీ రంగం

ABN , Publish Date - May 03 , 2025 | 05:16 AM

ఏప్రిల్‌లో దేశీయ తయారీ రంగం వృద్ధి 10 నెలల గరిష్ఠానికి చేరింది. కొత్త ఆర్డర్లతో తయారీ సూచీ 58.2 పాయింట్లకు పెరిగింది.

Manufacturing Surge: 10 నెలల గరిష్ఠానికి తయారీ రంగం

దేశీయ తయారీ రంగం వృద్ధి రేటు ఏప్రిల్‌లో 10 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. శక్తివంతమైన ఆర్డర్లతో హెచ్ఎస్‌బీసీ తయారీ రంగ సూచీ (పీఎంఐ) 58.2 పాయింట్లుగా నమోదైంది. మార్చిలో ఇది 58.1 పాయింట్లుంది. గత ఏడాది జూన్‌ తర్వాత నమోదైన వేగవంతమైన వృద్ధి ఇదే. విదేశాల నుంచి వచ్చిన కొత్త ఆర్డర్లు కూడా 14 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరాయని పేర్కొం టూ ఆఫ్రికా, ఆసియా, యూరప్‌, పశ్చిమాసియా, అమెరికా ఇందుకు అండగా నిలిచినట్టు తెలిపింది. వ్యాపారాల్లో సానుకూలతతో కంపెనీలు కొత్త సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు పీఎంఐ వెల్లడించింది.

Updated Date - May 03 , 2025 | 05:16 AM