Malabar Gold and Diamonds: మలబార్ గోల్డ్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ప్రచారం
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:00 AM
ఆభరణాల రిటైలింగ్‌లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్ 15వ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిం ది. కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన బ్రైడల్ రేంజి నగలు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆభరణాల రిటైలింగ్‌లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్ 15వ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిం ది. కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన బ్రైడల్ రేంజి నగలు వైవిధ్యభరితమైన వివాహ సాంప్రదాయానికి అద్దం పడతా యి. ఈ ఏడాది కార్యక్రమం 10 మంది సెలబ్రిటీలు, 22 మంది వధువులను ఒకే వేదిక పైకి తెస్తుందని కంపెనీ చైర్మన్ ఎంపీ అహ్మద్ చెప్పారు. ఈ ఎడిషన్‌లో దేశానికి చెందిన భిన్న ప్రాంతాల వివాహ సాంప్రదాయాలకు అనుగుణమైన డిజైన్లున్నట్టు ఆయన చెప్పారు. అన్ని డిజైన్లు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండడం కూడా ప్రత్యేకత అని, దీని వల్ల చెన్నైలో ఉన్న వధువు రాజస్తాన్ సాంప్రదాయానికి చెందిన పోల్కీ సెట్, ఢిల్లీకి చెందిన వధువు దక్షిణాదిలోని ఆలయ సాంప్రదాయానికి చెందిన డిజైన్లు ఎంపిక చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!