Mahindra and Mahindra Q1 results: మహీంద్రా లాభం రూ 4083 కోట్లు
ABN , Publish Date - Jul 31 , 2025 | 02:14 AM
దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 24ు వృద్ధితో రూ.4,083 కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది...
దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 24ు వృద్ధితో రూ.4,083 కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం రూ.3,283 కోట్లు. మొత్తం ఆదాయం రూ.37,218 కోట్ల నుంచి రూ.45,529 కోట్లకు పెరిగింది. ఆటో, వ్యవసాయ ఉపకరణాల విభాగం ఎప్పటివలెనే మంది వృద్ధిని నమోదు చేసిందని, ఈ విభాగంలో లాభాల మార్జిన్ 20ు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఆర్థిక సర్వీసుల విభాగం నిర్వహణలోని ఆస్తుల విలువ 15ు వృద్ధిని నమోదు చేసింది. ఐటీ సర్వీసుల విభాగం టెక్ మహీంద్రా డీల్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా తెలిపారు.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి