Share News

Mahindra XUV9S Electric SUV: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:29 AM

దేశీయ ఆటో దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త విద్యుత్‌ కారు ఎక్స్‌ఈవీ 9ఎస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఏడు సీట్లుండే ఈ కారు ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా టాప్‌ ఎండ్‌ వేరియెంట్‌ ధర...

Mahindra XUV9S Electric SUV: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్‌

ప్రారంభ ధర రూ.19.95 లక్షలు

బెంగళూరు: దేశీయ ఆటో దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త విద్యుత్‌ కారు ఎక్స్‌ఈవీ 9ఎస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఏడు సీట్లుండే ఈ కారు ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా టాప్‌ ఎండ్‌ వేరియెంట్‌ ధర రూ.29.45 లక్షలు. ఇంగ్లో ఎలక్ర్టిక్‌ వేదికపై అభివృద్ధి చేసిన ఈ కారు ప్రయాణికులు మరింత సౌకర్యంగా కూర్చుకునేం దుకు అవసరమైన ప్రదేశం కలిగి ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ బిజినెస్‌) ఆర్‌.వేలుసామి చెప్పారు. 2027-2028 నాటికి మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 25 శాతానికి పెంచుకోవాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విద్యుత్‌ కార్ల తయారీ సామర్థ్యాన్ని నెలకి 8 వేల యూనిట్లకు, విక్రయాలను 7 వేలకు పెంచాలనుకుంటున్నట్లు ఆటో, వ్యవసాయ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ రాజేష్‌ జెజూరికర్‌ తెలిపారు. ఎక్స్‌ఈ-9వీకి చెందిన అన్ని వేరియెంట్లకు ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద ప్రోత్సాహకాలు పొందే అర్హత కలిగి ఉందని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 05:29 AM