Share News

GAS Cylinder Prices: నేటి నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..

ABN , Publish Date - Dec 01 , 2025 | 09:25 AM

డిసెంబర్ ఒకటో తారీఖు మొదలైంది. దీంతో ఆర్థికాంశాల్లో ముఖ్యంగా భావించే గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.10మేర తగ్గింది. అయితే.. ఆయా నగరాల్లో ఈ రేట్లు ఎలా ఉన్నాయంటే...

GAS Cylinder Prices: నేటి నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..
Prices of LPG commercial cylinders slashed from December 1

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. గత కొంత కాలంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ రేట్ల ఆధారంగా.. తాజాగా ఈ నెలారంభంలో మరోసారి స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి(LPG commercial cylinder rates slashed from December 1). 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.10 చొప్పున తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా వాణిజ్య అవసరాల కోసం అనగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిల్లో ఉపయోగిస్తుంటారు. అయితే.. గృహ సిలిండర్(Domestic LPG Cylinder) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.


ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరల వివరాలిలా..

ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. డిసెంబర్(December) 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.10 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కొత్త ధర రూ.1580.50కు చేరింది. కోల్‌కతా(Kolkata)లో రూ.1684గా ఉండగా.. ముంబయి
(Mumbai)లో రూ.1531.50కి తగ్గింది. చెన్నై(Chennai)లో ప్రస్తుతం రూ.1739.50గా ఉంది. అయితే.. ఈ రేట్లు మెట్రో నగరాల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లో ఇప్పుడు రూ.1801.50కి చేరుకుంది.


ఇక, వంట గ్యాస్ ధరల విషయానికొస్తే.. గత కొంత కాలంగా వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం.. హైదరాబాద్‌లో రూ.905గా ఉంది. మరికొన్ని ముఖ్య నగరాల్లో గృహ వినియోగ సిలిండర్ల రేట్లను ఓసారి పరిశీలిస్తే..

  • ఢిల్లీ - రూ.853

  • ముంబయి - రూ.852.50

  • చెన్నై - రూ.868.50


ఇవీ చదవండి:

ఒకరి తీర్పును మరొకరు కొట్టివేయడం ఆందోళనకరం

ఇన్వెస్టర్స్‌కు అలర్ట్.. నేటి బంగారం, వెండి రేట్స్ ఇవీ

Updated Date - Dec 01 , 2025 | 09:30 AM