Share News

Global Capability Center: హైదరాబాద్‌లో లోరియల్‌ జీసీసీ

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:17 AM

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ సౌందర్య పోషక ఉత్పత్తుల సంస్థ ‘లోరియల్‌’ ఈ...

Global Capability Center: హైదరాబాద్‌లో లోరియల్‌ జీసీసీ

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ సౌందర్య పోషక ఉత్పత్తుల సంస్థ ‘లోరియల్‌’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అయితే కంపెనీ ఈ వార్తలపై అధికారికంగా నోరు మెదపడం లేదు. లోరియల్‌ కంపెనీకి ఇప్పటికే మన దేశంలోని ముంబై, బెంగళూరు నగరాల్లో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే జీసీసీ ద్వారా భారత్‌ను తన టెక్నాలజీ, నిర్వహణ కార్యకలాపాలకు కేంద్రం గా వాడుకోవాలని ఈ ఫ్రెంచ్‌ దిగ్గజం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన

అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 06:17 AM