Share News

మేడ్చల్‌లో లోహియా గ్రూప్‌ బిస్కట్‌ ఫ్యాక్టరీ

ABN , Publish Date - May 01 , 2025 | 01:35 AM

విభిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న లోహియా గ్రూప్‌ తెలంగాణలోని మేడ్చల్‌లో అత్యాధునిక బిస్కట్‌ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది...

మేడ్చల్‌లో లోహియా గ్రూప్‌ బిస్కట్‌ ఫ్యాక్టరీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విభిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న లోహియా గ్రూప్‌ తెలంగాణలోని మేడ్చల్‌లో అత్యాధునిక బిస్కట్‌ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్టు లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీషా లోహియా లహోటి చెప్పారు. ఏడెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పూర్తి ఆటోమేటెడ్‌ హైస్పీడ్‌ ఫ్యాక్టరీ సామర్థ్యం నెలకి వెయ్యి టన్నులని ఆమె తెలిపారు. రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీలో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 4 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని ఆమె అన్నారు.

Read Also: Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

Updated Date - May 01 , 2025 | 01:35 AM