Real Estate Listed Companies: రియల్టీలో లిస్టెడ్ కంపెనీల అమ్మకాల జోరు
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:21 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు దేశంలోని 28 లిస్టెడ్ రియల్టీ కంపెనీలకు బాగానే కలిసొచ్చింది. ఈ కాలంలో ఈ కంపెనీలు రూ.92,437 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదు చేశాయి..
ఆరు నెలల్లో రూ.92,437 కోట్లు
న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు దేశంలోని 28 లిస్టెడ్ రియల్టీ కంపెనీలకు బాగానే కలిసొచ్చింది. ఈ కాలంలో ఈ కంపెనీలు రూ.92,437 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదు చేశాయి. ఇందులో టాప్-5 కంపెనీల వాటానే రూ.63,000 కోట్లకు (70ు) పైగా ఉంది. కొవిడ్ తర్వాత అన్ని వసతులు ఉన్న నివాస గృహాలకు గిరాకీ పెరగడం, చిన్న చిన్న బిల్డర్ల వద్ద కొని ఇబ్బందులు పడేందుకు కొనుగోలుదారులు ఇష్టపడకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెరా వచ్చినా చిన్న చిన్న బిల్డర్లపై నమ్మకం లేకపోవడం సైతం ఇందుకు దోహదం చేసింది.
టాప్-5 లిస్టెడ్ సెల్లర్స్
కంపెనీ పేరు అమ్మకాలు(రూ.కోట్లలో)
ప్రెస్టీజ్ గ్రూప్ రూ.18,147.7
డీఎల్‌ఎఫ్ రూ.15,757
గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ.15,587
లోథా డెవలపర్ప్ రూ.9,020
సిగ్నేచర్ గ్లోబల్ రూ.4,650
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి