Share News

Life Insurance Corporation: ఎల్‌ఐసీ లాభం రూ 10987 కోట్లు

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:52 AM

బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.10, 987 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.10,461 కోట్లతో పోల్చితే...

Life Insurance Corporation: ఎల్‌ఐసీ లాభం రూ 10987 కోట్లు

న్యూఢిల్లీ: బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.10, 987 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.10,461 కోట్లతో పోల్చితే లాభం 5% మాత్రమే పెరిగింది. ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.2,10,910 కోట్ల నుంచి 2,22,864 కోట్లకు పెరిగింది. తొలి ప్రీమియం వసూళ్లు రూ.7,525 కోట్లుగాను, రెన్యువల్‌ ప్రీమియం వసూళ్లు రూ.59,885 కోట్లుగాను నమోదయ్యాయి. ‘‘మేం లాభదాయకత పెంచుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో రెండంకెల వృద్ధిని సాధించడం మా లక్ష్యం’’ అని ఎల్‌ఐసీ సీఈఓ ఆర్‌. దొరైస్వామి అన్నారు. తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో కంపెనీ మార్కెట్‌ వాటా 63.51 శాతంగా ఉందని, వ్యక్తిగత-గ్రూప్‌ వ్యాపారాల్లో తాము అగ్రస్థానం నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 05:52 AM