Laurus Labs: రూ 5000 కోట్లతో విశాఖలో అధునాతన ప్లాంట్
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:33 AM
లారస్ లేబొరేటరీస్.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఒక అత్యాధునిక భారీ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
హైదరాబాద్: లారస్ లేబొరేటరీస్.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఒక అత్యాధునిక భారీ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 532 ఎకరాలు కేటాయించిందని లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసే ఈ భారీ యూనిట్‌ను వచ్చే ఎనిమిదేళ్లలో పూర్తి చేయనున్నట్లు ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ కాల్‌లో ఆయన వెల్లడించారు. అవసరమైతే ఈ ప్లాంట్ కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా మైసూరులో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ ఫెర్మెంటేషన్ యూనిట్‌ను కూడా విశాఖకు తరలిస్తున్నట్టు సత్యనారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి