Haldirams Stake Deal: హల్దీరామ్‌లో ఎల్ క్యాటెర్టన్‌కు వాటా
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:10 AM
దేశంలో అతిపెద్ద ప్యాక్డ్ స్నాక్ అండ్ స్వీట్స్ తయారీదారు హల్దీరామ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు కంపెనీలో వాటా కూడా కొనుగోలు చేసినట్లు...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్యాక్డ్ స్నాక్ అండ్ స్వీట్స్ తయారీదారు హల్దీరామ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు కంపెనీలో వాటా కూడా కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ అగ్రగామి పెట్టుబడి సంస్థ ఎల్ క్యాటెర్టన్ గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 3,900 కోట్ల డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను నిర్వహిస్తున్న ఎల్ క్యాటెర్టన్.. హల్దీరామ్‌లో ఎంత పెట్టుబడికి ఎంత వాటా కొనుగోలు చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, రూ.85,000 కోట్ల మార్కెట్ విలువ ప్రకారంగా డీల్ కుదిరినట్లు సమాచారం. మార్కెట్లో హల్దీ రామ్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ విస్తరణకు ఈ భాగస్వామ్యం దోహదపడనుందని ఎల్ క్యాటెర్టన్ పేర్కొంది.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News